శుక్రవారం 29 మే 2020
Sports - Mar 31, 2020 , 14:53:45

స్మిత్ మళ్లీ కెప్టెన్ అవుతానంటే మద్దతిస్తా: పైన్

స్మిత్ మళ్లీ కెప్టెన్ అవుతానంటే మద్దతిస్తా: పైన్

సిడ్నీ: ఆస్ట్రేలియా కెప్టెన్సీ పగ్గాలను స్టీవ్ స్మిత్ మళ్లీ అందుకోవాలనుకుంటే అతడికి పూర్తి మద్దతునిస్తానని ప్రస్తుత టెస్టు సారథి టిమ్ పైన్ అన్నాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో అప్పుడు కెప్టెన్​గా ఉన్న స్మిత్​పై రెండేండ్ల పాటు సారథ్య నిషేధం పడిన సంగతి తెలిసిందే.  ఈ నిషేధం ఆదివారంతో ముగియడంతో స్టీవ్​ మళ్లీ కెప్టెన్సీ రేసులోకి వచ్చాడు. దీంతో పాటు యువ ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తుండడంతో జట్టులోనూ పోటీ పెరిగిపోయింది. వచ్చేఏడాది టెస్ట్ ప్రపంచ చాంపియన్​షిప్ ఫైనల్​ నాటికి పైన్​ 36ఏండ్ల వయసుకు చేరుకుంటాడు. అప్పటి వరకు జట్టులో చోటు ఉండడంపై సందిగ్ధత ఏర్పడడంతో కెప్టెన్సీపై పైన్​ పెదవి విప్పాడు. “కెప్టెన్​గా ఎంపిక చేసుకునేందుకు జట్టులో కొందరు ఉన్నారు. స్మిత్ ఇదివరకే సారథిగా చేశాడు. ట్రావిస్ హెడ్​, అలెక్స్ కేరీ, మార్నస్​ లబుషేన్​, పాట్ కమిన్స్​ ఆటగాళ్లుగా వేగంగా ఎదుగుతున్నారు. జట్టులో డెప్త్ పెరుగుతున్నది. అందుకే నా సమయం ముగిసేటప్పటికి చాలా ఆప్షన్లు ఉంటాయనుకుంటున్నా. ఈ విషయంపై స్మిత్​తో చర్చించలేదు. ఒకవేళ అతడు మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలనుకుంటే నేను పూర్తి మద్దతిస్తా. స్టీవ్​ అద్భుతమైన సారథి. అతడి కెప్టెన్సీలో ఆడేందుకు సంతోషిస్తా. స్మిత్​ మళ్లీ ఆస్ట్రేలియా సారథ్యపగ్గాలు చేపడతాడని ఆశిస్తున్నా” అని టిమ్ పైన్ చెప్పాడు.


logo