శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Aug 08, 2020 , 13:57:34

ఆ టెస్టుపై ఇప్పుడే ఏం చెప్పలేం: క్రికెట్ ఆస్ట్రేలియా

ఆ టెస్టుపై ఇప్పుడే ఏం చెప్పలేం: క్రికెట్ ఆస్ట్రేలియా

న్యూఢిల్లీ: భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఈ ఏడాది బాక్సింగ్ డే టెస్టును మెల్​బోర్న్​ నుంచి తరలించడంపై ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే తొందరపాటే అవుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈవో నిక్ హాక్లీ అన్నాడు. ఆ మ్యాచ్​ను అక్కడే నిర్వహించేందుకు పూర్తి కృషి చేస్తామని శనివారం చెప్పాడు. నాలుగు టెస్టు సిరీస్​లో భాగంగా భారత్​, ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్​ 26 నుంచి డిసెంబర్​ 30వ తేదీ మధ్య మూడో మ్యాచ్​గా బాక్సింగ్ డే టెస్టు జరుగాల్సింది. అయితే మెల్​బోర్న్​లో కరోనా తీవ్రత పెరుగుతుండడంతో ఈ మ్యాచ్​పై సందిగ్ధత నెలకొంది. కాగా 1980 నుంచి మెల్​బోర్న్​లో ప్రతి ఏటా బాక్సింగ్ డే టెస్టు జరుగుతున్నది.

 “ఆస్ట్రేలియా క్రీడా ఈవెంట్లలో బాక్సింగ్ డే టెస్టుకు చాలా ప్రాధాన్యముంది. మెల్​బోర్న్ క్రికెట్ గ్రౌండ్​లోనే బాక్సింగ్ డే టెస్టు జరుపేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. అక్కడే నిర్వహిందుకు అన్ని ఏర్పాట్లు చేసేందుకు ముందుకెళతాం” అని హ్యక్లీ స్పష్టం చేశాడు. కాగా భారత్​, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్​ డిసెంబర్ 3న ప్రారంభం కానుంది. 


logo