దుబాయ్: వెస్టిండీస్‌తో పోరులో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతున్నారు. తొలి ఓవర్లోనే ఆండ్రీ రస్సెల్ అద్భుత త్రోకు కెప్టెన్ టెంబా బవుమా (2) రనౌట్ అయినా మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (39) రాణించడంతో ఆ జట్టుకు నిలబడింది. వాన్ డర్ డస్సెన్ (19 నాటౌట్) భారీ షాట్లకు పోకుండా నింపాదిగా ఆడుతున్నాడు.
ఎయిడెన్ మార్క్రమ్ (7 నాటౌట్) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా జట్టు రెండు వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో అకియల్ హుస్సేన్ ఒక వికెట్ తీశాడు.