గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Sep 15, 2020 , 20:57:19

ఐపీఎల్​లో విదేశీ కోచ్​లే ఎందుకు..?: వెంగ్​సర్కార్​

ఐపీఎల్​లో విదేశీ కోచ్​లే ఎందుకు..?: వెంగ్​సర్కార్​

న్యూఢిల్లీ: ఐపీఎల్​లో విదేశీ కోచ్​ల బదులు ఫ్రాంచైజీలు భారత కోచ్​లను నియమించుకోవాలని భారత మాజీ క్రికెటర్​ వెంగ్​సర్కార్ సూచించాడు. విదేశీ లీగ్​ల్లో ఎంత మంది భారత కోచ్​లు పని చేస్తున్నారని, అలాంటప్పుడు ఇక్కడ విదేశీ కోచ్​లే అత్యధికంగా ఎందుకున్నారని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించాడు. ప్రస్తుతం ఐపీఎల్​లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు మినహా మరే ఫ్రాంచైజీకి హెడ్​కోచ్​గా భారత మాజీ ఆటగాడు లేడు. ఇదే విషయాన్ని వెంగ్​సర్కార్ లేవనెత్తాడు.

“ఐపీఎల్ జట్లకు ఎక్కువ మంది భారత కోచ్​లు ఉండాలి. ఎందుకంటే చాలా మందికి అపార అనుభవం ఉంది. రాష్ట్రాల జట్లకు వారు అద్భుతంగా దిశానిర్దేశం చేస్తున్నారు. బిగ్​బాష్ లాంటి లీగ్​ల్లో భారత కోచ్​లు ఉన్నారా? అలాంటప్పుడు మనం విదేశీ కోచ్​లను ఎందుకు నియమించుకోవాలి? మన వాళ్లు విదేశీ కోచ్​లకు సమానంగా.. కొందరు మరింత అత్యుత్తమంగా పని చేయగరు, ఫలితాలు రాబట్టగలరు. మన కోచ్​లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. భారత కోచ్​లు అద్భుతాలు చేస్తారని నేను కచ్చితంగా చెప్పగలను” అని వెంగ్​సర్కార్​ అన్నాడు. 


logo