గురువారం 13 ఆగస్టు 2020
Sports - Jul 04, 2020 , 02:59:41

కోహ్లీతో నన్ను పోల్చొద్దు: బాబర్‌

 కోహ్లీతో నన్ను పోల్చొద్దు: బాబర్‌

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అడుగు జాడల్లో నడుస్తూ.. మేటి బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు సాధించడమే తన లక్ష్యమని ఇదివరకు చెప్పిన పాకిస్థాన్‌ కొత్త కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ ఇప్పుడు మాట మార్చాడు. కోహ్లీతో పోలిక తనకు నచ్చదని శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘విరాట్‌ కోహ్లీతో పోల్చడాన్ని ఇష్టపడను. దానికి బదులు నన్ను పాకిస్థాన్‌ గ్రేట్‌ ప్లేయర్స్‌ జావేద్‌ మియాందాద్‌, మహమ్మద్‌ యూసుఫ్‌, యూనిస్‌ ఖాన్‌ వంటి వాళ్లతో పోలిస్తే ఆనందిస్తా’ అని బాబర్‌ అన్నాడు. కాగా కెరీర్‌ తొలినాళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే కోహ్లీ కన్నా బాబర్‌కే మంచి రికార్డు ఉందని పాక్‌  మాజీ కెప్టెన్‌  ఇంజమామ్‌ అన్నాడు. 


logo