శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sports - Feb 03, 2021 , 01:15:50

డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్‌

డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్‌

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో న్యూజిలాండ్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. వచ్చే నెలలో జరుగాల్సి ఉన్న దక్షిణాఫ్రికా పర్యటనను ఆస్ట్రేలియా జట్టు వాయిదా వేసుకోవడంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 70 రేటింగ్‌ పాయింట్స్‌తో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ ఫైనల్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇక రెండో స్థానం కోసం భారత్‌ (71.7), ఇంగ్లండ్‌ (65.2), ఆస్ట్రేలియా (69.2) పోటీ పడుతున్నాయి. స్వదేశంలో కోహ్లీ సేన ఇంగ్లండ్‌ను చిత్తు చేస్తే జూన్‌ 18న లార్డ్స్‌ వేదికగా జరుగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్‌తో తలపడనుంది. ఒకవేళ భారత్‌తో సిరీస్‌ను ఇంగ్లండ్‌ క్లీన్‌స్వీప్‌ చేస్తే.. ఇంగ్లిష్‌ జట్టుకు ఆ అవకాశం దక్కుతుంది. సిరీస్‌ ‘డ్రా’ అయితే ఆసీస్‌ పోటీలోకి రానుంది.

VIDEOS

logo