శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Sep 04, 2020 , 17:11:48

ఇప్ప‌డు మా వైస్ కెప్టెన్ ఎవ‌రు? : చెన్నై అభిమాని ప్ర‌శ్న‌కు ఫ్రాంచైజీ అద్భుత స‌మాధానం

ఇప్ప‌డు మా వైస్ కెప్టెన్ ఎవ‌రు? : చెన్నై అభిమాని ప్ర‌శ్న‌కు ఫ్రాంచైజీ అద్భుత స‌మాధానం

అత్య‌ధిక అభిమానులు ఉన్న ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో సీఎస్‌కే ఒక‌టి. అందుకు త‌గ్గ‌ట్టే జ‌ట్టు ఆట‌గాళ్లు కూడా ఐపీఎల్‌లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తూనే ఉంటారు. క‌రోనా భ‌యం జ‌ట్టును వెంటాడుతున్నా.. స్టార్ ఆట‌గాడు సురేశ్ రైనా జ‌ట్టుకు దూర‌మైనా.. ఫ్రాంచైజీ మాత్రం అభిమానుల‌కు ధైర్యాన్ని నూరి పోస్తోంది. 

ఐపీఎల్ 2020 నుంచి రైనా వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల త‌ప్పుకోగా జ‌ట్టు బ‌ల‌మైన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయింద‌ని చాలా మంది అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ధోని త‌రువాత సీఎస్‌కేలో రైనా వైస్‌కెప్టెన్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్న నేప‌థ్యంలో "ఇప్పుడు మా వైస్ కెప్టెన్ ఎవరు?" అని చెన్నై జ‌ట్టు అభిమాని ఒక‌రు ట్విట్ట‌ర్‌లో పోస్టు చేయ‌గా.. దానికి సీఎస్‌కే అధికారిక అకౌంట్ నుంచి అద్భుతమైన సమాధానం ఇచ్చింది. "వైస్‌‌ కెప్టెన్ ఇరుక్కే బయం యెన్?" అని త‌మిళంలో రిప్లై ఇచ్చింది. "మనకు తెలివైన కెప్టెన్ ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి?" అనేది దీని అర్థం. ఎంఎస్ ధోని సీఎస్‌కేకు మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ తెచ్చిపెట్టాడు. అత్యంత స్థిరమైన, విజ‌య‌వంత‌మైన జ‌ట్ల‌లో సీఎస్‌కే ఒక‌టిగా నిల‌వ‌డానికి ధోని తోడ్పాటు ఎంతో ఉంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo