గురువారం 09 ఏప్రిల్ 2020
Sports - Mar 24, 2020 , 16:21:05

బెస్ట్‌ ఆల్‌రౌండర్‌ ఎవరంటే..

బెస్ట్‌ ఆల్‌రౌండర్‌ ఎవరంటే..

ప్రపంచ క్రికెట్‌లో బెస్ట్‌ ఆల్‌రౌండర్‌ ఎవరంటే వెంటనే గుర్తొచ్చేది ఆండ్రూ ఫ్లింటాఫ్‌, యువరాజ్‌సింగ్‌. అయితే ప్రస్తుత క్రికెట్‌లో హార్దిక్‌ పాండ్య, బెన్‌ స్టోక్స్‌లలో  ఉత్తమ ఆల్‌రౌండర్‌ ఎవరని ట్విట్టర్‌ ద్వారా ప్రశ్నించాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్‌బౌలర్‌ బ్రాడ్‌ హాగ్‌. తాను మాత్రం ఇంగ్లడ్‌ క్రికెటర్‌ బెన్‌ స్టోక్స్‌నే ఎంపికచేస్తానని పేర్కొన్నాడు. ఎందుకంటే పాండ్యాకు అత్యధిక సామర్థ్యం ఉన్నప్పట్టికీ అంతర్జాతీయ క్రికెట్‌లో అంతగా అనుభవం లేదని అభిప్రాయపడ్డాడు. అందుకే తన వరల్డ్‌ ఎలెవెన్‌లో జట్టులో స్థానానికి స్టోక్స్‌తో పాండ్యా పోటీపడలేకపోయాడని ట్వీట్‌ చేశాడు.


logo