గురువారం 02 జూలై 2020
Sports - May 03, 2020 , 10:59:28

రోహిత్​ ఈస్థాయిలో ఉండేందుకు ధోనీయే కారణం: గంభీర్​

రోహిత్​ ఈస్థాయిలో ఉండేందుకు ధోనీయే కారణం: గంభీర్​

న్యూఢిల్లీ: ప్రపంచంలో నిఅత్యుత్తమ బ్యాట్స్​మెన్​లో ఒకడిగా  టీమ్​ఇండియా ఓపెనర్​ రోహిత్ శర్మ ఎదగడానికి మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ ఓ కారణమని మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ చెప్పాడు. రోహిత్​ను ఓపెనర్​గా పంపాలని మహీ 2013లో  నిర్ణయం తీసుకున్నాడని, అందుకే హిట్​మ్యాన్​ ప్రస్తుతం ఈస్థాయిలో ఉన్నాడని గంభీర్ చెప్పాడు. 2007లో రోహిత్​ శర్మ అరంగేట్రం చేయగా.. 2013లో అతడిని అప్పటి కెప్టెన్​ ధోనీ ఓపెనర్​గా మార్చాడు. అప్పటి నుంచి రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఏకంగా వన్డేల్లో మూడు ద్విశతకాలతో చరిత్ర సృష్టించాడు. అయితే రోహిత్ విజయం వెనుక ధోనీ ఉన్నాడని గంభీర్ స్పోర్ట్స్​టాక్​తో ఇంటర్వ్యూలో తాజాగా వెల్లడించాడు. “సెలెక్షన్ కమిటీ, జట్టు మేనేజ్​మెంట్​ గురించి మాట్లాడొచ్చు. కానీ కెప్టెన్​ మద్దతు లేకపోతే అవన్నీ నిరుపయోగమే. అంతా కెప్టెన్ చేతుల్లోనే ఉంటుంది. రోహిత్​ శర్మకు ధోనీ చాలా కాలం మద్దతుగా నిలిచాడు. అంత సపోర్ట్ మరే ఆడగాడు పొందలేదని నేను అనుకుంటున్నా” అని గంభీర్ చెప్పాడు. ప్రస్తుతం శుభ్​మన్​ గిల్​, సంజూ శాంసన్ లాంటి యువ ఆటగాళ్లకు కెప్టెన్ విరాట్​ కోహ్లీ, రోహిత్ శర్మ మద్దతుగా నిలువాల్సిన అవసరం ఉందని గౌతమ్ గంభీర్ చెప్పాడు.  


logo