శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Aug 08, 2020 , 14:55:11

‘ద్రవిడ్​ను ఔటివ్వాలని అంపైర్​ను అడిగా’

‘ద్రవిడ్​ను ఔటివ్వాలని అంపైర్​ను అడిగా’

న్యూఢిల్లీ: శుక్రవారం రాత్రిని ఎంజాయ్ చేసేందుకు భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్​ను త్వరగా ఔట్ చేయాలని తాను, షాహిద్ అఫ్రిది కలిసి ఓ మ్యాచ్​లో ప్రణాళిక వేశామని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఆ మ్యాచ్​లో ఓ బంతి ద్రవిడ్ ప్యాడ్​కు తగలగా.. ఔటివ్వాలని తాను అంపైర్​ను అడిగానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 1999లో బెంగళూరు వేదికగా జరిగిన పెప్సీ కప్ ఫైనల్​లో ఈ ఘటన జరిగింది. ఆ మ్యాచ్​కు భారత దిగ్గజం సచిన్​ దూరం కాగా పాకిస్థాన్​ 123 పరుగుల తేడాతో గెలిచింది.

“బెంగళూరులో ఫైనల్ జరిగింది. త్వరగానే 3-4 వికెట్లు తీశాం. ఆ మ్యాచ్​లో సచిన్ ఆడలేదు. ఆ రోజు శుక్రవారం రాత్రి. ద్రవిడ్ ఎక్కువ సేపు ఆడతాడు, ఏదో ఒకడి చేసి అతడిని ఔట్ చేయాలని అఫ్రిది నాతో చెప్పాడు. ద్రవిడ్​ బ్యాట్​, ప్యాడ్ల మధ్య బంతిని వేడయమే లక్ష్యంగా బౌలింగ్ చేశా. ఆ సమయంలో నేను వేసిన ఓ బంతి ద్రవిడ్ ప్యాడ్లకు నేరుగా తగిలింది. అయినా అంపైర్ ఔటివ్వలేదు. అప్పీల్ చేసే సమయంలో ఇది శుక్రవారం రాత్రి అని కూడా అంపైర్​తో అన్నా. అయినా ఔటివ్వలేదు. చివరికి మేం గెలిచాం. ద్రవిడ్​కు బౌలింగ్ చేయడం చాలా కష్టం. అతడు ఎంతో అంకితభావంతో ఆడతాడు. నా బౌలింగ్​ను అతడు సునాయాసంగా ఎదుర్కుంటాడు” అని అక్తర్ అన్నాడు. 


logo