శనివారం 04 జూలై 2020
Sports - Apr 20, 2020 , 23:03:15

నా వ‌ల్లే జ‌డ్డూకు తిట్లు ప‌డ్డాయి: ఇషాంత్‌

నా వ‌ల్లే జ‌డ్డూకు తిట్లు ప‌డ్డాయి: ఇషాంత్‌

ముంబై: గ‌తేడాది ఐపీఎల్ సంద‌ర్భంగా టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ.. ఆల్‌రౌండ‌ర్ జ‌డేజాను తిట్టాడ‌ని వెట‌ర‌న్ పేస‌ర్ ఇషాంత్ శ‌ర్మ పేర్కొన్నాడు. అందుకు కార‌ణం మాత్రం తానేన‌ని ఈ లంబూ పేర్కొన్నాడు. ఐపీఎల్ 12వ సీజ‌న్‌లో భాగంగా ఢిల్లీ, చెన్నై మ్యాచ్‌లో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుందన తెలిపాడు. 

`నేను భారీ షాట్లు ఆడ‌లేన‌ని గ‌తంలో మ‌హీ భాయ్ అన్నాడు. అయితే ఐపీఎల్ 12వ సీజ‌న్‌లో చెన్నైతో మ్యాచ్‌లో ర‌వీంద్ర జ‌డేజా (జ‌డ్డూ) బౌలింగ్‌లో వ‌రుస బంతుల్లో 4,6 కొట్టాను. అంత‌టితో ఆగ‌కుండా మ‌హీ భాయ్ వైపు ఓ లుక్కేశాను. అంతే ఇక కెప్టెన్ కూల్‌.. జ‌డ్డూపై విరుచుకుప‌డ్డాడు. ఎలా బౌలింగ్ చేస్తున్నావ‌ని క‌సురుకున్నాడు` అని ఇషాంత్ చెప్పుకొచ్చాడు.logo