గురువారం 09 ఏప్రిల్ 2020
Sports - Mar 19, 2020 , 00:23:44

ప్రమాదంలోకి నెడుతున్నారు

ప్రమాదంలోకి నెడుతున్నారు

  • కరోనా వైరస్‌ వ్యాపిస్తుంటే.. శిక్షణ ఎలా?.. ఐఓసీపై అథ్లెట్ల అసంతృప్తి 

టోక్యో: కరోనా వైరస్‌(కొవిడ్‌-19) విజృంభిస్తున్నా షెడ్యూల్‌ ప్రకారమే టోక్యో విశ్వక్రీడలు నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐవోసీ) ప్రకటించడంపై పలువురు అథ్లెట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అథ్లెట్ల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా ఒలింపిక్స్‌ నిర్వాహకులు మాట్లాడుతున్నారని ఒలింపిక్‌ పోల్‌వాల్ట్‌ చాంపియన్‌ క్యాథరీనా స్పెఫానిడి(గ్రీసు) బుధవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఒలింపిక్స్‌ కోసం ప్రతిరోజు సన్నద్ధమవుతూ మాతో పాటు కుటుంబ సభ్యులు, ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టాలని ఐఓసీ అనుకుంటుందా? నాలుగు నెలల్లో కాదు.. 


ఐఓసీ ఇప్పుడే మా ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నది. ఇది నమ్మశక్యం కాకుండా ఉంది’ అని స్పెఫానిడి ట్వీట్‌ చేసింది. ‘కలిసి ప్రాక్టీస్‌ చేయాల్సిన టీమ్‌ విభాగం పోటీలకు ఎలా సన్నద్ధమవ్వాలి.. స్విమ్మింగ్‌ మాటేమిటి... అలాగే జిమ్మాస్టిక్స్‌ సాధనలో ఒకరు ముట్టుకున్న పరికరాలనే మరొకరు వినియోగించాల్సి ఉంటుంది’ అని ఐఓసీని  బ్రిటీష్‌ హెప్టాథ్లాన్‌ అథ్లెట్‌ జాన్‌సన్‌ థాంప్సన్‌ ప్రశ్నించింది. అయితే కరోనా సంక్షోభానికి ప్రస్తుతానికైతే తమ వద్ద ఎలాంటి ఉత్తమ పరిష్కారం లేదని ఐవోసీ తెలిపింది. 


logo