శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Aug 22, 2020 , 20:11:33

‘ప్రస్తుత టీం vs మాజీ ప్లేయర్స్‌’ మ్యాచ్‌ పెడితే ఎలా ఉంటుంది? : పఠాన్‌

‘ప్రస్తుత టీం vs మాజీ ప్లేయర్స్‌’ మ్యాచ్‌ పెడితే ఎలా ఉంటుంది? : పఠాన్‌

న్యూ ఢిల్లీ : మాజీ జాతీయ ఆల్‌ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తుత భారత జట్టుతో మాజీ ఆటగాళ్లందరూ కలిసి ఆడేలా ఓ ఆసక్తికరమైన మ్యాచ్‌ను ప్రతిపాదించాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి వీడ్కోలు మ్యాచ్ గురించి నడుస్తున్న చర్చల మధ్య పఠాన్‌ ఈ సూచన చేశాడు. 

‘చాలా మంది రిటైర్డ్ ప్లేయర్స్ కోసం వీడ్కోలు మ్యాచ్‌ గురించి మాట్లాడుతున్నారు. రిటైర్మెంట్‌ అయిన ఆటగాళ్లు కూడా సరైన వీడ్కోలు పొందలేదు. ప్రస్తుత భారత జట్టుకు వ్యతిరేకంగా రిటైర్డ్ ఆటగాళ్లతో కూడిన జట్టు నుంచి ఛారిటీ కమ్ వీడ్కోలు మ్యాచ్‌ పెడితే ఎలా ఉంటుంది.’ అని పఠాన్ శనివారం ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు పఠాన్‌ తాను జట్టులో ఉన్నప్పటి మాజీ ఆటగాళ్ల బ్యాటింగ్‌ ఆర్డర్‌ స్క్రీన్ షాట్‌ను జతచేశాడు. 

పఠాన్‌ పెట్టిన బ్యాటింగ్‌ ఆర్డర్‌లో గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్‌ ఓపెనర్లు కాగా.. రాహుల్ ద్రవిడ్ మూడో స్థానంలో ఉండగా అతడి తరువాత వీవీఎస్‌ లక్ష్మణ్ ఉన్నాడు. ఐదో స్థానంలో యువరాజ్‌ ఉండగా.. ధోని ఆరో స్థానంలో ఉన్నాడు.  తరువాత పఠాన్‌, అజిత్ అగార్కర్‌, జహీర్ ఖాన్, ప్రగ్యాన్ ఓజా ఉన్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo