సోమవారం 06 జూలై 2020
Sports - Jun 25, 2020 , 00:27:55

టెస్టులకు సాటిలేదు: కోహ్లీ

టెస్టులకు సాటిలేదు: కోహ్లీ

ముంబై: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. టెస్టు క్రికెట్‌పై తన ఇష్టాన్ని మరోసారి వ్యక్తం చేశాడు. సంప్రదాయ ఫార్మాట్‌ ఆడడం ముందు ఏదీ సాటిరాదని ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం పోస్ట్‌ చేశాడు. ‘తెల్ల జెర్సీలో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ ఆడడానికి ఏదీ దరిదాపుల్లోకి రాదు. భారత్‌ తరఫున టెస్టు క్రికెట్‌ ఆడడం గొప్ప వరంగా భావిస్తున్నా’  అని కోహ్లీ పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా కీర్తి పొందుతున్న కోహ్లీ ఇప్పటి వరకు 86 టెస్టులు ఆడి 53.62 సగటుతో 7,240 పరుగులు (27 సెంచరీలు, 22 అర్ధ శతకాలు) చేశాడు. 248 వన్డేల్లో 11,867 పరుగులు సాధించాడు.


logo