శుక్రవారం 07 ఆగస్టు 2020
Sports - Jul 16, 2020 , 15:20:25

ENGvWI:రెండో టెస్టుకు వరుణుడి అడ్డంకి

ENGvWI:రెండో టెస్టుకు వరుణుడి అడ్డంకి

మాంచెస్టర్‌:   మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ మధ్య గురువారం ఆరంభంకావాల్సిన  రెండో టెస్టుకు వరుణుడు అడ్డంకిగా  మారాడు. చిరు జల్లులు కురుస్తుండటంతో మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షం కారణంగా టాస్‌ ఆలస్యంకానుంది. చిరు జల్లులు కురుస్తుండటంతో పిచ్‌పై కవర్లు కప్పి ఉంచారు. 

 కరోనా లాక్‌డౌన్‌ తర్వాత జరిగిన తొలి  అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌  ఆఖరి వరకు ఉత్కంఠరేపడం  అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నది.    ఆతిథ్య జట్టుకు ఊహించని షాకిచ్చిన కరీబియన్‌ టీమ్‌  మూడు టెస్టుల సిరీస్‌లో  1-0 ఆధిక్యంతో నిలిచింది.  రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ సొంతం చేసుకోవాలని విండీస్‌ ఉత్సాహంతో ఉన్నది.  మరోవైపు సిరీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ టెస్టులో ఇంగ్లాండ్‌  తప్పక నెగ్గాల్సిందే. సిరీస్‌ను సమం చేయాలనే  పట్టుదలతో   కెప్టెన్‌ జో రూట్‌ నేతృత్వంలోని ఇంగ్లీష్‌ టీమ్‌ పట్టుదలతో ఉన్నది.   


logo