బుధవారం 30 సెప్టెంబర్ 2020
Sports - Aug 28, 2020 , 00:43:52

టెన్నిస్‌కు నిరసనల సెగ

టెన్నిస్‌కు నిరసనల సెగ

  న్యూయార్క్‌: వెస్ట్రన్‌, సదరన్‌ ఓపెన్‌కు వర్ణ వివక్ష వ్యతిరేక ఆందోళనల సెగ తగిలింది. అమెరికాలోని విస్కోన్‌సిన్‌లో జరిగిన పోలీసుల కాల్పుల్లో నల్లజాతీయుడు చనిపోవడంతో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో టోర్నీ మహిళల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు చేరిన నవోమీ ఒసాకా(జపాన్‌) వర్ణ అసమానతలను నిరసిస్తూ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో గురువారం పోటీలను నిర్వాహకులు నిలిపివేశారు. మళ్లీ శుక్రవారం పునఃప్రారంభిస్తామని ప్రకటించారు. మరో నాలుగు రోజుల్లో యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ న్యూయార్క్‌లోనే ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా వైరస్‌ ఆందోళన కారణంగా ఇప్పటికే పలువురు స్టార్‌ ప్లేయర్లు ఆ టోర్నీకి దూరం కాగా ఇప్పుడు వర్ణ వివక్ష నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి.

  సెమీస్‌లో జొకోవిచ్‌ 

  ప్రపంచ అగ్ర ర్యాంకు ఆటగాడు, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ వెస్ట్రన్‌, సదరన్‌ ఓపెన్‌ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో 6-3, 6-1తేడాతో జన్‌లెనార్డ్‌ స్టఫ్‌పై గెలిచి ముందడుగేశాడు. కాగా మరోమ్యాచ్‌లో ఢిపెండింగ్‌ చాంపియన్‌ డానిల్‌ మద్వెదెవ్‌ 6-1, 4-6, 3-6తేడాతో బటిస్టా అగట్‌(స్పెయిన్‌)చేతిలో పరాజయం చెందాడు. సెమీస్‌లో జొకో, అగట్‌ తలపడనున్నారు. 


logo