శుక్రవారం 14 ఆగస్టు 2020
Sports - Jul 14, 2020 , 22:24:18

ర్యాంకింగ్స్​లోనూ హోల్డర్​ సత్తా

ర్యాంకింగ్స్​లోనూ హోల్డర్​ సత్తా

దుబాయ్:​ వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ టెస్టు ర్యాంకింగ్స్​లో సత్తాచాటాడు. ఇంగ్లండ్​తో తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్​లో ఆరు సహా మొత్తం ఏడు వికెట్లు పడగొట్టిన అతడు టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్​లో రెండో స్థానానికి ఎగబాకాడు. ఐసీసీ మంగళవారం తాజా టెస్టు ర్యాంకింగ్స్​ను విడుదల చేయగా.. కివీస్ పేసర్ నీల్ వాగ్నర్​ను వెనక్కి నెట్టి కెరీర్​లో అత్యుత్తమంగా రెండో ర్యాంకుకు హోల్డర్ చేరుకున్నాడు. అలాగే 862పాయింట్లతో కెరీర్​లో అత్యుత్తమ స్థానానికి చేరుకోవడంతో పాటు.. 2000 సంవత్సరంలో వాల్ష్​ తర్వాత అత్యుత్తమ రేటింగ్ పాయింట్స్ దక్కించుకున్న విండీస్ బౌలర్​గానూ నిలిచాడు. దీంతో పాటు ఆల్​రౌండర్ల విభాగంలో హోల్డర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

మరోవైపు కరోనా కారణంగా మార్చి నుంచి టీమ్​ఇండియా ఆటగాళ్లు మ్యాచ్​లు ఆడకపోవడంతో ర్యాంకింగ్స్​లో మార్పులు జరుగలేదు. టెస్టు బ్యాట్స్​మెన్ విభాగంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో ర్యాంకులో కొనసాగగా… ఆస్ట్రేలియా అగ్రశ్రేణి ఆటగాడు స్టీవ్ స్మిత్ టాప్​ ర్యాంకులో ఉన్నాడు. టీమ్ఇండియా ఆటగాళ్లు చతేశ్వర్ పుజార, అజింక్య రహానే ఏడు, తొమ్మిదో స్థానాల్లో ఉన్నారు. టెస్టు బౌలర్ల  ర్యాంక్సింగ్స్​లో భారత స్టార్ పేసర్ జస్ర్పీత్ బుమ్రా ఏడో స్థానంలో ఉండగా.. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ పేసర్ నీల్ వాగ్నర్​ మూడో స్థానానికి పడిపోయాడు. 


logo