శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Feb 07, 2021 , 00:45:49

మోమినుల్‌ సెంచరీ

మోమినుల్‌ సెంచరీ

  • విండీస్‌ టార్గెట్‌ 395.. ప్రస్తుతం 110/3 

చిట్టగాంగ్‌: కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌ (115) సెంచరీతో చెలరేగడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ మంచి స్కోరు చేసింది. కెప్టెన్‌తో పాటు లిటన్‌ దాస్‌ (69) రాణించడంతో బంగ్లా 223/8 వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. విండీస్‌ బౌలర్లలో రాకీమ్‌ కార్న్‌వాల్‌, వారికన్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. 395 పరుగుల భారీ టార్గెట్‌తో శనివారం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వెస్టిండీస్‌.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 110/3తో నిలిచింది. చేతిలో ఏడు వికెట్లు ఉన్న కరీబియన్లు విజయానికి 285 పరుగులు చేయాల్సి ఉంది. బూనర్‌ (15), మయేర్స్‌ (37) క్రీజులో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్‌కు మూడు వికెట్లు దక్కాయి.


VIDEOS

logo