మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 07, 2020 , 13:12:53

రసెల్‌ విధ్వంసం..14 బంతుల్లో 6 సిక్సర్లు

రసెల్‌ విధ్వంసం..14 బంతుల్లో 6 సిక్సర్లు

పల్లెకెలె: కరీబియన్‌ హార్డ్‌హిట్టర్‌ ఆండ్రూ రసెల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రీలంకతో రెండో టీ20లో కేవలం 14 బంతులే ఆడిన రసెల్‌ 6 సిక్సర్లతో విరుచుకుపడి అజేయంగా 40 పరుగులు చేశాడు. దీంతో రెండో టీ20లో విండీస్‌ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు రసెల్‌ దక్కించుకున్నాడు. శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వెస్టిండీస్‌ 2-0తో చేజిక్కించుకుంది.  ఆరంభంలో బ్రాండన్‌ కింగ్‌(43: 21 బంతుల్లో 6ఫోర్లు )..ఆఖర్లో రసెల్‌(40 నాటౌట్‌: 14 బంతుల్లో 6సిక్సర్లు) వీరవిహారం చేయడంతో విండీస్‌ 17 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. 

156 పరుగుల లక్ష్యాన్ని కరీబియన్‌ ఇంకో మూడు ఓవర్లు మిగిలుండగానే ఛేదించడం విశేషం. అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన లంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. శనక(31 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. మైదానంలో రసెల్‌ భారీ సిక్సర్లు కొడుతుంటూ అభిమానులు తెగ ఎంజాయ్‌ చేశారు.  ఇద్దరు విండీస్‌ ఆటగాళ్లు 28 బంతుల్లో 10 సిక్సర్లు బాదడం విశేషం. 


logo
>>>>>>