ఆదివారం 09 ఆగస్టు 2020
Sports - Jul 11, 2020 , 18:18:28

బౌలర్ల జోరు..16ఓవర్లలో 17 పరుగులే

బౌలర్ల జోరు..16ఓవర్లలో 17 పరుగులే

సౌతాంప్టన్‌:  వెస్టిండీస్‌తో తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఆచితూచి ఆడుతున్నారు. కరీబియన్‌ బౌలర్లను ఎదుర్కోవడంలో  ఇంగ్లీష్‌ ఆటగాళ్లు ఇబ్బందిపడుతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ బంతితో ఇంగ్లాండ్‌ను విండీస్‌ కట్టడి చేస్తోంది.  నాలుగో రోజు ఆటలో  లంచ్‌ విరామ సమయానికి  సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 40 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 79 పరుగులు   చేసింది. ఆతిథ్య జట్టు ఇంకా 35 పరుగులు వెనుకబడి ఉంది. 

శనివారం ఉదయం సెషన్‌లో  ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్లు  నిలకడగా రాణించి మంచి శుభారంభం అందించారు.  బర్న్స్‌(42),  సిబ్లే జోడీ  కుదురుకోవడంతో పాటు నిదానంగా భాగస్వామ్యాన్ని నెలకొల్పే ప్రయత్నం చేశారు. ఐతే హాఫ్‌సెంచరీకి చేరువైన బర్న్స్‌ చెత్త షాట్‌ ఆడి  రోస్టన్‌ ఛేజ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 

 ప్రస్తుతం సిబ్లే(31), జో డెన్లీ(1) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ వికెట్‌ ఇవ్వకూడదన్న లక్ష్యంతో బ్యాటింగ్‌ చేస్తున్నారు.   నాలుగోరోజూ విండీస్‌ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. బౌలర్లు హవా కొనసాగుతుండటంతో డ్రింక్స్‌ విరామం తర్వాత  16 ఓవర్లలో ఇంగ్లాండ్‌ కేవలం 17 పరుగులు మాత్రమే సాధించింది. చాలా ఓవర్లు మెయిడిన్‌ కావడం విశేషం.   విండీస్‌ క్రమశిక్షణతో బంతులేయడంతో ఇంగ్లాండ్‌ తడబడుతోంది. 


logo