సోమవారం 13 జూలై 2020
Sports - Jun 28, 2020 , 15:26:19

స్వీయ నిర్బంధంలోకి విండీస్‌ హెడ్‌ కోచ్‌

స్వీయ నిర్బంధంలోకి విండీస్‌ హెడ్‌ కోచ్‌

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌ క్రికెట్‌ టీమ్‌ హెడ్‌ కోచ్‌ ఫిల్‌ సిమన్స్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాడు. రెండు రోజుల క్రితం అంత్యక్రియలకు హాజరైన  నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సిమన్స్‌ సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ ఇంగ్లాండ్‌ జరిగే మూడు టెస్టుల సిరీస్‌కు జట్టు సన్నాహాలకు ఎలాంటి ఆటంకం కలిగించదని ఫాస్ట్‌ బౌలర్‌ అల్జారీ జోసెఫ్‌ తెలిపాడు. శుక్రవారం అంత్యక్రియలకు హాజరైనప్పటి నుంచి తాను బసచేస్తున్న ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ హోటల్‌లోనే సిమన్స్‌ నిర్బంధంలో ఉంటున్నాడు.

వచ్చే గురువారం విండీస్‌ జట్టుతో అతడు కలవాలంటే కనీసం రెండు కరోనా టెస్టులకు హాజరుకావాల్సి ఉంటుంది. రెండింటిలోనూ కోవిడ్‌-19 నెగెటివ్‌గా వస్తేనే అతడు జట్టుతో కలిసేందుకు అనుమతి లభిస్తుంది. ఐతే సిమన్స్‌ మాకు దూరంగా ఉంటున్నప్పటికీ ఇంగ్లాండ్‌తో సిరీస్‌ సన్నాహాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మిగతా కోచింగ్‌ సహాయ సిబ్బంది మద్దతుగా ఉన్నారని జోసెఫ్‌ పేర్కొన్నాడు. 


logo