మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Nov 12, 2020 , 01:30:47

విండీస్‌ ప్లేయర్లపై ఆంక్షలు

విండీస్‌ ప్లేయర్లపై ఆంక్షలు

వెల్లింగ్టన్‌: క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వెస్టిండీస్‌ జట్టు ఆటగాళ్లపై న్యూజిలాండ్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఐసోలేషన్‌లో ప్రాక్టీస్‌ చేసుకునే సదుపాయాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆతిథ్య జట్టుతో సిరీస్‌ల కోసం విండీస్‌ ఆటగాళ్లు ప్రస్తుతం క్రైస్ట్‌చర్చ్‌లోని ఓ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే అనుమతి లేకుండా ప్లేయర్లు హోటల్‌లో తిరగడం, ఆహారాన్ని తినడం సీసీ టీవీ ఫుటేజీల  ద్వారా తెలిసిందని, అందుకే ఆంక్షలు విధిస్తున్నట్టు న్యూజిలాండ్‌ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటికే విండీస్‌ ఆటగాళ్లు 12 రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకోగా.. 14రోజుల గడువు పూర్తయ్యే వరకు వారు ప్రాక్టీస్‌ చేసేందుకు వీలులేదని వెల్లడించింది. ఏవైనా సమస్యలొస్తే క్వారంటైన్‌ వ్యవధిని కూడా పొడిగిస్తామని తెలిపింది. నవంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 15 మధ్య న్యూజిలాండ్‌తో వెస్టిండీస్‌ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది.