శుక్రవారం 22 జనవరి 2021
Sports - Jan 02, 2021 , 16:54:26

గంగూలీ త్వరగా కోలుకోవాలి: మమతా బెనర్జీ

గంగూలీ త్వరగా కోలుకోవాలి: మమతా బెనర్జీ

కోల్‌కతా:భారత మాజీ క్రికెట్‌ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ  త్వరగా కోలుకోవాలని టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ ఆకాంక్షించారు. దాదా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ భ‌గవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ట్విటర్లో పేర్కొన్నారు. గంగూలీ కోల్‌కతాలోని తన ఇంట్లో వ్యాయామం చేస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో  వెంటనే  ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

'గంగూలీకి గుండెపోటు వచ్చిందన్న వార్త  తెలిసి చాలా బాధపడ్డాను. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న దాదా  పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.  ఈ సమయంలోగంగూలీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు' మమతా ట్వీట్‌ చేశారు. 


logo