సోమవారం 01 మార్చి 2021
Sports - Jan 28, 2021 , 18:43:57

గంగూలీని పరామర్శించిన మమతా బెనర్జీ

గంగూలీని పరామర్శించిన మమతా బెనర్జీ

కోల్‌కతా: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ(48) బుధవారం ఆసుపత్రిలో  చేరిన విషయం తెలిసిందే.  మంగళవారం సాయంత్రం నుంచి ఛాతీలో అసౌకర్యంగా అనిపించడంతో బుధవారం మధ్యాహ్నం కోల్‌కతాలోని అపోలో హాస్పిటల్‌లో  చేరారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అపోలో ఆస్పత్రిలో గంగూలీని పరామర్శించారు. దాదా ఆరోగ్య పరిస్థితి, తదుపరి చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.  ఈనెల మొదటి వారంలో గంగూలీకి  యాంజియోప్లాస్టీ చేసి ఒక స్టెంట్‌ వేసిన సంగతి తెలిసిందే.

VIDEOS

logo