సోమవారం 25 మే 2020
Sports - May 23, 2020 , 19:52:10

కొత్త మార్గాలు వెతకాలి: వోక్స్‌

కొత్త మార్గాలు వెతకాలి: వోక్స్‌

లండన్‌: బంతిని పాలిష్‌ చేసేందుకు ఉమ్మి (సలైవా) వాడకాన్ని నిషేధించిన నేపథ్యంలో.. దానికి బదులు ఇతర మార్గాలు వెతకాల్సిన అవసరం ఉందని ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌వోక్స్‌ పేర్కొన్నాడు. విశ్వవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఆటగాళ్ల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఐసీసీ ఉమ్మిపై నిషేధం విధించింది. ‘కెరీర్‌ ప్రారంభం నుంచి ఉమ్మి రాయడం అలవాటైపోవడంతో.. దీన్ని నిషేధించారనే విషయాన్ని అప్పుడప్పుడు మనకు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే దాని కోసం కొత్త మార్గాలు అన్వేషించాలి. అది పెద్ద కష్టం కాబోదు’అని వోక్స్‌ అభిప్రాయపడ్డాడు.

ఇంగ్లండ్‌ వంటి పేస్‌ పిచ్‌లపై బంతి మూమెంట్‌ ఉండాలంటే దాన్ని బాగా రుద్దాల్సి వస్తుందని వోక్స్‌ అన్నాడు. కొవిడ్‌-19 కారణంగా క్రీడా టోర్నీలన్నీ రౖద్దెన అనంతరం తిరిగి మైదానంలో పెట్టిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందిన 31 ఏండ్ల వోక్స్‌.. పోచెఫ్‌స్ట్రూమ్‌ మైదానంలో ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాడు. క్రికెట్‌ సీజన్‌ ప్రారంభానికి ముందే బౌలర్లకు తగిన ప్రాక్టీస్‌ లభించాలనే ఉద్దేశంతో ఈసీబీ ఏడు మైదానాల్లో 18 మంది ఆటగాళ్లకు శిక్షణ ఆరంభించింది. అయితే మొత్తం నెట్స్‌లో కేవలం ఒక ప్లేయర్‌తో పాటు ఫిజియోకు మాత్రమే అనుమతినిచ్చింది.  


logo