మంగళవారం 07 జూలై 2020
Sports - May 12, 2020 , 15:50:36

పోడియంపై నిలువ‌డ‌మే మా ల‌క్ష్యం: నిక్కీ ప్ర‌ధాన్‌

పోడియంపై నిలువ‌డ‌మే మా ల‌క్ష్యం:  నిక్కీ ప్ర‌ధాన్‌

బెంగ‌ళూరు: ప‌్ర‌తిష్ఠాత్మ‌క టోక్యో ఒలింపిక్స్‌లో ప‌త‌కం సాధించ‌డ‌మే త‌మ ముందున్న ఏకైక ల‌క్ష్య‌మ‌ని భార‌త మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు మిడ్‌ఫీల్డ‌ర్ నిక్కీ ప్ర‌ధాన్ అంటున్న‌ది. 36 ఏండ్ల సుదీర్ఘ విరామం అనంత‌రం భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు రియో (2016) ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన విష‌యం తెలిసింతే. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించ‌డంతో ప్ర‌స్తుత బెంగ‌ళూరులోని సాయ్ కేంద్రానికే ప‌రిమిత‌మైన హాకీ జ‌ట్టు ఆన్‌లైన్ క్లాస్‌ల ద్వారా ప్ర‌త్యేక్ష శిక్ష‌ణ పొందుతున్న‌ది.

`చాన్నాళ్ల త‌ర్వాత 2016లో ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించ‌గ‌లిగాం. అది ప్రారంభం మాత్ర‌మే. ఈ సారి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప‌త‌కం నెగ్గ‌డ‌మే మా ల‌క్ష్యం. ఒలింపియ‌న్లుగా మిగిలిపోవాల‌ని అనుకోవ‌డం లేదు. ఒలింపిక్ ప‌త‌క విజేత‌లుగా చరిత్ర‌లో నిలువాల‌నుకుంటున్నాం. ఇది నా ఒక్క‌దాని మాట కాదు జ‌ట్టులోని మిగిలిన ప్లేయ‌ర్లంతా ఇలాగే ఆలోచిస్తున్నారు. దాని కోసం ఎంత క‌ష్ట‌ప‌డేందుకైనా సిద్ధంగా ఉన్నారు` అని నిక్కీ చెప్పుకొచ్చింది.


logo