మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 12, 2020 , 02:04:21

పోటీలోకి వచ్చా

పోటీలోకి వచ్చా

పుణె: ఓపెనర్‌గా తుదిజట్టులో స్థానం కోసం తాను తిరిగి పోటీలోకి వచ్చానని టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధవన్‌ అన్నాడు. శ్రీలంకతో రెండు టీ20ల్లో 32, 52పరుగులు చేసిన గబ్బర్‌.. తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఇటీవలి కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కేఎల్‌ రాహుల్‌ కూడా అద్భుతంగా ఆడుతుండడంతో రోహిత్‌కు జోడీగా తదుపరి సిరీస్‌ల్లో ఓపెనర్‌గా ఎవరిని పంపాలన్నది జట్టు మేనేజ్‌మెంట్‌కు పెద్దసవాల్‌గా మారింది. ఇద్దరిలో రాహులే నయమని పలువురు మాజీలు అభిప్రాయపడగా ధవన్‌ బ్యాట్‌తో సమాధానం చెప్పడంతో పాటు.. మంచి ప్రదర్శన చేయడమే తన పని అని చెప్పుకొచ్చాడు. ‘మేం ముగ్గురం(రోహిత్‌, రాహుల్‌, ధవన్‌) బాగా ఆడుతున్నాం. రెండు నెలల నుంచి రాహుల్‌ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పుడు నేను కూడా పోటీలోకి వచ్చా. ఎంపిక అనేది నా చేతుల్లో లేదు. అందుకే నేను ఆ విషయం గురించి ఆలోచించను. మంచిగా ఆడడమే నా చేతుల్లో ఉంది. వచ్చిన రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. బౌలర్ల లైన్‌, లెంగ్త్‌ లయ తప్పించేందుకు లెఫ్ట్‌హ్యాండెడ్‌ బ్యాట్స్‌మెన్‌ ఎంతో ఉపయోగపడతారు’ అని ధవన్‌ చెప్పాడు.


logo
>>>>>>