సోమవారం 06 జూలై 2020
Sports - Jun 04, 2020 , 00:12:15

ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి

 ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి

  • వీడియో కాన్ఫరెన్స్‌లో క్రీడా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: లాక్‌డౌన్‌ కారణంగా ఇండ్లకే పరిమితమైన క్రీడాకారులు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కాపాడుకునే విధంగా సూచనలివ్వాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌.. డాక్టర్లు, ఫిజియోథెరిపిస్ట్‌లు, న్యూట్రిషియన్లకు సూచించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న పలువురు క్రీడాకారులతో పాటు వైద్య సిబ్బందితో బుధవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్‌ తీసుకున్న ముందస్తు జాగ్రత్తల వల్ల వైరస్‌ విస్తరించకుండా అడ్డుకోగలిగాం. లాక్‌డౌన్‌ నిబంధనలతో క్రీడాకారులు శిక్షణకు దూరమయ్యారు. ఇలాంటి సమయంలో ఫిట్‌నెస్‌ కాపాడుకునేందుకు సులువైన టెక్నిక్‌లతో పాటు మంచి డైట్‌ను సూచించాలి’అని వైద్య సిబ్బందిని కోరారు.


logo