బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Aug 17, 2020 , 23:53:51

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యమిస్తుందని రాష్ట్ర క్రీడా,పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం రవీంద్ర భారతిలోని కార్యాలయంలో మంత్రితో టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా సమావేశమైంది. జిల్లాల వారీగా 15 నుంచి 20 మంది క్రీడాకారులకు తన అకాడమీలో అంతర్జాతీయ కోచ్‌లతో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వ సహకారం కావాలని మంత్రిని సానియా కోరింది. దీనికి తోడు ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తే శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సానియా తెలిపింది. మంత్రి మాట్లాడుతూ శిక్షణ సదుపాయాలపై త్వరలో జరిగే క్యాబినెట్‌ సబ్‌కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సానియా తల్లి  నసీమా, చాముండేశ్వరి నాథ్‌ పాల్గొన్నా  మరోవైపు హైదరాబాద్‌ గోల్ఫ్‌ కోర్సును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. logo