మా వాళ్లు సరిగా ఆడలేదు: విరాట్ కోహ్లి

చెన్నై: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా దారుణ పరాజయంపై మాట్లాడాడు కెప్టెన్ విరాట్ కోహ్లి. టీమ్‌లోని ప్లేయర్స్ బాడీ లాంగ్వేజ్ బాగా లేదని, ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యారని కోహ్లి అన్నాడు. అనుభవం లేని స్పిన్నర్లయిన వాషింగ్టన్ సుందర్, షాబాజ్ నదీమ్ అంత సమర్థంగా బౌలింగ్ చేయలేకపోయారని చెప్పాడు. తొలి సగంలో వాళ్లపై మేము తగిన ఒత్తడి తీసుకురాలేకపోయాం. పేస్ బౌర్లు, అశ్విన్ బాగా బౌలింగ్ చేశారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో కొన్ని పరుగులను మేము కట్టడి చేయాల్సింది అని అన్నాడు. తొలి రెండు రోజులూ పిచ్ బౌలింగ్‌కు అంతగా అనుకూలించలేదని విరాట్ చెప్పాడు. ఇంగ్లండ్‌కే క్రెడిట్ దక్కుతుందని, వాళ్లు భారీ స్కోరు చేసి తమపై ఒత్తిడి పెంచారని కోహ్లి అన్నాడు. రెండో టెస్ట్ చెన్నైలోనే ఫిబ్రవరి 13 నుంచి జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఏడాది తర్వాత తొలిసారి ప్రేక్షకులను అనుమతించనున్నారు.