బుధవారం 15 జూలై 2020
Sports - Jun 13, 2020 , 21:19:57

ప్రత్యామ్నాయం ఉండాల్సిందే: బౌలర్ల కోసం గళమెత్తిన సచిన్​

ప్రత్యామ్నాయం ఉండాల్సిందే: బౌలర్ల కోసం గళమెత్తిన సచిన్​

న్యూఢిల్లీ: బంతికి ఉమ్ము రాయకుంటే టెస్టుల్లో మధ్య ఓవర్లలో బౌలర్లు ఎలా స్వింగ్ చేయగలరని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. అందుకే బంతి మెరుపు పెంచేందుకు ఉమ్ముకు ప్రత్యామ్నాయాన్ని ఐసీసీ ప్రవేశపెట్టాలని శనివారం ఓ టీవీ చర్చా కార్యక్రమంలో సూచించాడు. అలాగే టెస్టుల కోసం బౌలింగ్​కు అనుకూలించే పిచ్​లను తయారు చేయాలని మాస్టర్​ చెప్పాడు.

“ఐసీసీ కొత్త నిబంధనలతో ఆట తీరు కచ్చితంగా మారుతుంది. బంతికి ఉమ్ము వాడకాన్ని నిషేధించింది.. అయితే మధ్య ఓవర్లలో బౌలర్లు బంతిని ఎలా స్వింగ్ చేయగరు.. కొన్నిదేశాల్లో వాతావరణం కారణంగా ఆటగాళ్లకు చెమట కూడా రాదు. మరి బంతి మెరుపును ఎలా పెంచాలి? ఇలాంటి సమయాల్లో అంపైర్లకు వాక్స్​(జెల్ లాంటి పదార్థం) డబ్బా ఇవ్వాలి. ఒక్కో ఇన్నింగ్స్​కు బంతికి ఎంత వాక్స్​ రుద్దాలి అని ఐసీసీ నిబంధన తేవాలి. 45, 50 ఓవర్ల తర్వాత బంతిని మార్చాలా లేదా అన్నది అంపైర్లు నిర్ణయించాలి. బౌలర్లకు ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడం ద్వారా మైదానంలో పోరు సమతూకంగా ఉంటుంది. మొత్తంగా ఉమ్ముపై నిషేధం బౌలర్లకు చాలా ప్రతికూలమే. పిచ్​కు బౌలింగ్​కు అనుకూలంగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ అలా లేకుంటే ప్రతి 45,50 ఓవర్లకు బంతికి మార్చాలి” అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చెప్పాడు. కాగా కరోనా నేపథ్యంలో బంతికి ఉమ్ము రాయడాన్ని ఐసీసీ నిషేధించిన సంగతి తెలిసిందే. ఒకవేళ బంతికి ఉమ్మును పదేపదే రుద్దితే ఫీల్డింగ్ జట్టుకు అంపైర్లు ఐదు పరుగుల పెనాల్టీ విధించి.. ప్రత్యర్థి జట్టు ఖాతాలో జమ చేస్తారు. 


logo