బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 04, 2020 , 22:18:41

KXIP vs CSK: దంచికొడుతున్న చెన్నై ఓపెనర్లు

KXIP vs CSK: దంచికొడుతున్న  చెన్నై ఓపెనర్లు

దుబాయ్:  కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్లు చెలరేగి ఆడుతున్నారు. 179 పరుగుల లక్ష్య ఛేదనలో  ఓపెనర్లు  డుప్లెసిస్‌, షేన్‌ వాట్సన్‌  చెన్నై జట్టుకు అదిరే  శుభారంభం అందించారు. పంజాబ్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ బౌండరీలు బాదేస్తున్నారు. పవర్‌ప్లేలో చెన్నై వికెట్‌ నష్టపోకుండా 60 పరుగులు సాధించింది. ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. 

జోర్డాన్‌ వేసిన ఆరో ఓవర్లో డుప్లెసిస్‌ ఏకంగా 4 ఫోర్లు బాది 19 పరుగులు రాబట్టాడు.  హర్‌ప్రీత్‌ వేసిన తర్వాతి ఓవర్లో వాట్సన్‌ రెండు ఫోర్లు కొట్టగా.. డుప్లెసిస్‌ ఫోర్‌ బాది మరో 15 రన్స్‌ సాధించారు. ఓపెనర్లిద్దరూ క్రీజులో కుదురుకొని బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో చెన్నై స్కోరు వేగంగా దూసుకెళ్తోంది.  సాధించాల్సిన రన్‌రేట్‌ చాలా తక్కువగా ఉండటంతో చెన్నై సునాయాస విజయాన్ని అందుకోనుంది.  9 ఓవర్లు ముగిసేసరికి చెన్నై వికెట్‌ నష్టపోకుండా 95  పరుగులు చేసింది.  వాట్సన్‌(43), డుప్లెసిస్‌(45) క్రీజులో ఉన్నారు.