శుక్రవారం 03 జూలై 2020
Sports - Apr 26, 2020 , 12:18:10

వార్నర్.. కుటుంబ సమేతంగా..

వార్నర్.. కుటుంబ సమేతంగా..

లాక్​డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్​ డేవిడ్ వార్నర్​ కుటుంబంతో చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో ఆడుకోవడంతో పాటు డ్యాన్స్లు కూడా చేస్తున్నారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా జెర్సీతో పాటు ప్యాడ్లు హెల్మెట్​ ధరించిన వార్నర్​.. భార్య, పిల్లలతో ఓ టిక్​టాక్ వీడియో చేశాడు. దీన్ని ఇన్​స్టాగ్రామ్​లోనూ పంచుకున్నాడు.ఈ వీడియోకు అభిమానులు లైక్​లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  బాలీవుడ్ సినిమా తీస్​మార్ చిత్రంలోని షీలా కి జవానీ పాటకు కూతుర్లతో వార్నర్ ఇటీవల డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. 

View this post on Instagram

#SATURDAYVIBES @candywarner1

A post shared by David Warner (@davidwarner31) on


logo