మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Sep 10, 2020 , 12:53:45

రోహిత్ సిక్స్ కొడితే.. బంతి బస్సుపై పడింది: వీడియో వైరల్‌

రోహిత్ సిక్స్ కొడితే.. బంతి   బస్సుపై పడింది: వీడియో వైరల్‌

దుబాయ్‌: రాబోయే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ కోసం ఫ్రాంఛైజీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. ఆటగాళ్లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ముమ్మరంగా సాధన చేస్తున్నారు.  హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ టీమ్‌ అబుదాబిలో ప్రాక్టీస్‌ చేస్తున్నది. ప్రాక్టీస్‌లో హిట్‌మ్యాన్‌ కొట్టిన బంతి స్టేడియం ఆవల పడింది.

స్పిన్నర్‌ బౌలింగ్‌లో  రోహిత్‌ ముందుకొచ్చి   భారీ షాట్‌ ఆడగా బంతి 95 మీటర్లు ప్రయాణించి మైదానం బయట రోడ్డు మీద వెళ్తున్న ఓ బస్సును తాకింది.  దీనికి సంబంధించిన వీడియోను ముంబై టీమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో  వైరల్‌గా మారింది.   ఈ నెల 19న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆరంభ మ్యాచ్‌తో ఐపీఎల్‌ 13వ సీజన్‌ మొదలవనుంది. 


logo