బుధవారం 03 మార్చి 2021
Sports - Feb 09, 2021 , 17:58:30

కోచ్‌ పదవికి వసీం జాఫర్‌ రాజీనామా

కోచ్‌ పదవికి వసీం జాఫర్‌ రాజీనామా

న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్లో ఉత్తరాఖండ్‌ జట్టు  ప్రధాన కోచ్‌,  భారత మాజీ బ్యాట్స్‌మన్‌ వసీం జాఫర్‌ ఏడాదిలోపే తన పదవికి రాజీనామా చేశారు. ఫిబ్రవరి 20 నుంచి విజయ్‌ హజారే ట్రోఫీ ప్రారంభంకానుండగా టోర్నీలో పాల్గొనేందుకు జట్టు బయలుదేరడానికి  కొద్దిరోజుల ముందే ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు  చర్చనీయాంశమైంది.  

అన్ని ఫార్మాట్ల నుంచి క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత జాఫర్‌ గతేడాది మార్చిలో కోచ్‌గా నియమితులయ్యాడు. జాఫర్‌ ఆకస్మికంగా రాజీనామా చేయడానికి గల కారణాలు తెలియదని, అయితే అతడు మాత్రం కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నట్లు ఉత్తరాఖండ్‌ అధికారులు ధ్రువీకరించారు. ఉత్తరాఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఇంకా అతని రాజీనామాను ఆమోదించలేదు.  సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఆ జట్టు ఘోర ప్రదర్శనతో నిరాశపరిచిన విషయం తెలిసిందే.  

VIDEOS

logo