మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Aug 01, 2020 , 03:31:45

పీఎస్‌ఎల్‌ కంటే ఐపీఎల్‌ బెస్ట్‌: అక్రమ్‌

పీఎస్‌ఎల్‌ కంటే ఐపీఎల్‌ బెస్ట్‌: అక్రమ్‌

కరాచీ: పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) కంటే ఐపీఎల్‌ ఎంతో పెద్దదని, ప్రపంచంలోనే అది అత్యుత్తమ టోర్నమెంట్‌ అని పాక్‌ పేస్‌ దిగ్గజం వసీం అక్రమ్‌ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌ భారీ వ్యయంతో జరుగుతున్నదని, అందుకే అత్యుత్తమ ప్రమాణాలతో ఉంటుందని ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. ‘ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్‌ టోర్నమెంట్‌ ఐపీఎల్‌. కేవలం ఆటగాళ్లను కొనేందుకే ఒక్కో ఫ్రాంచైజీ రూ.60-80కోట్లు ఖర్చు చేస్తుంది. మా కరెన్సీలో అది దాదాపు రెట్టింపు. ఐపీఎల్‌ ద్వారా వచ్చిన ఆదాయాన్ని బీసీసీఐ.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు ఖర్చు చేస్తున్నది. ఎంతో మంది మ్యాచ్‌ విన్నర్లను ఐపీఎల్‌ తయారు చేసింది’ అని వసీం అక్రమ్‌ అన్నాడు. logo