బుధవారం 08 జూలై 2020
Sports - May 03, 2020 , 18:26:10

పాక్ మ‌హిళ‌ల జ‌ట్టుకు అక్ర‌మ్ ఆన్‌లైన్ పాఠాలు

పాక్ మ‌హిళ‌ల జ‌ట్టుకు అక్ర‌మ్ ఆన్‌లైన్ పాఠాలు

లాహోర్‌:  పాకిస్థాన్ మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు ప్లేయ‌ర్ల‌కు ఆ దేశ పురుష క్రికెట‌ర్ల‌తో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు పీసీబీ తెలిపింది. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా క్రీడాటోర్నీల‌న్నీ ర‌ద్దు కావ‌డంతో.. ఆట‌గాళ్లంతా ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. ఈ లాక్‌డౌన్ వేళ‌ల్లో మైదానాల్లో ప్రాక్టీస్‌కు కూడా అనుమ‌తి లేక‌పోవ‌డంతో ప్లేయ‌ర్లు ఆన్‌లైన్ ద్వారా పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా దిగ్గ‌జ ఆట‌గాడు వ‌సీం అక్ర‌మ్ ద్వారా పీసీబీ ప్ర‌త్యేక పాఠాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. 

`సోమ‌వారం పాకిస్థాన్ మ‌హిళ‌ల  క్రికెట్ జ‌ట్టుకు దిగ్గ‌జ ఆల్‌రౌండ‌ర్ అక్ర‌మ్ ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్ప‌నున్నాడు. సుమారు 35 మంది ప్లేయ‌ర్లు ఈ శిక్ష‌ణ‌లో పాల్గొంటారు`అని పీసీబీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఆల్‌టైమ్ గ్రేట్ నుంచి మెళ‌కువ‌లు నేర్చుకునేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నామ‌ని అమ్మాయిలు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.


logo