ఆదివారం 24 జనవరి 2021
Sports - Dec 08, 2020 , 13:08:31

ఒక్క కిడ్నీతోనే అథ్లెటిక్స్‌లో రాణించా: అంజూ బాబీ జార్జ్‌

ఒక్క కిడ్నీతోనే అథ్లెటిక్స్‌లో రాణించా: అంజూ బాబీ జార్జ్‌

హైద‌రాబాద్‌:  లాంగ్ జంప్ అథ్లెట్ అంజూ బాబీ జార్జ్ ఓ న‌మ్మ‌లేని నిజాన్ని చెప్పారు.  2003లో పారిస్‌లో జ‌రిగిన ప్ర‌పంచ అథ్లెటిక్స్ మీట్‌లో కాంస్య ప‌త‌కం సాధించిన అంజూ జార్జ్.. ఒక్క కిడ్నీతోనే అథ్లెటిక్స్‌లో రాణించిన‌ట్లు వెల్ల‌డించింది.  త‌న ట్విట్ట‌ర్‌లో సోమ‌వారం ఈ విష‌యాన్ని ఆమె తెలిపారు.  మీరు న‌మ్మినా, న‌మ్మ‌క‌పోయినా.. నేను మాత్రం అదృష్ట‌వంతురాల్ని, ఒకే ఒక కిడ్నీ క‌లిగి  ఉండి.. అత్యున్న‌త స్థాయికి చేరిన క్రీడాకారుల్లో తాను ఒక అథ్లెట్‌ను అని అంజూ జార్జ్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్న‌ది.  పెయిన్ కిల్ల‌ర్ కూడా త‌న‌కు ప‌డేవికాదు అని, త‌న టేకాఫ్ కాలు కూడా అంత‌గా ప‌నిచేయ‌ద‌ని, అవ‌రోధాలు ఎన్ని ఉన్నా.. తాను మాత్రం రాణించిన‌ట్లు ఆమె చెప్పారు.  దీన్ని కోచ్ అద్భుతంగా చెప్పామా, లేక అథ్లెట్ నైపుణ్యం అని చెబుతామా అని అంజూ జార్జ్ త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు.  కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిర‌ణ్ రిజిజూకు ఆమె త‌న ట్వీట్‌ను పంపారు. దీనిపై ఆయ‌న కూడా రియాక్ట్ అయ్యారు.  అంజూ, మీ శ్ర‌మ‌, ప‌ట్టుద‌ల‌తో పాటు కోచ్‌ల స‌హ‌కారంతో మీరు దేశానికి వ‌న్నె తెచ్చార‌ని మంత్రి అన్నారు. ప్ర‌పంచ అథ్లెటిక్ చాంపియ‌న్‌షిప్‌లో మెడ‌ల్ గెలిచిన ఏకైక అథ్లెట్ మీరేనంటూ ఆయ‌న రీట్వీట్ చేశారు.  

లాంగ్ జంప్ ఈవెంట్‌లో అంజూ జార్జ్‌.. ఏథేన్స్‌లో జ‌రిగిన 2004 ఒలింపిక్ గేమ్స్‌లో ఆర‌వ స్థానంలో నిలిచింది. ఆ పోటీల్లో ఆమె 6.83 మీట‌ర్ల దూరం దూకింది.  బూసాన్‌లో జ‌రిగిన 2002 ఏషియ‌న్ గేమ్స్‌లో ఆమె స్వ‌ర్ణ ప‌త‌కం సాధించింది.  


logo