బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Aug 08, 2020 , 23:20:51

డబ్బు కాదు, పతకాలే నాకు ముఖ్యం: సింధు

డబ్బు కాదు, పతకాలే నాకు ముఖ్యం: సింధు

న్యూఢిల్లీ: తనకు డబ్బు ముఖ్యం కాదని, పతకాలు గెలువడమే అత్యంత ప్రాధాన్యంగా భావిస్తానని బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్, తెలుగు షట్లర్​ పీవీ సింధు చెప్పింది. అయితే పతకాలే ధనాన్ని తెచ్చిపెడతాయని శనివారం ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. గతేడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కడంపై ఎదురైన ప్రశ్నకు సిందు సమాధానం చెప్పింది.  అధిక ఆదాయం ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్ల గతేడాది జాబితాలో సింధు(దాదాపు రూ.41కోట్లు) 13వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

“ఫోర్బ్స్ జాబితాలో నా పేరు చూసుకోవడం సంతోషంగా అనిపించింది. బ్యాడ్మింటన్ కంటే విభిన్నమైన విషయం కాబట్టి నేను షూటింగ్​(ప్రకటనల కోసం)లకు వెళ్లేందుకు ఇష్టపడతాను. నాకు ఇక డబ్బు అవసరం లేదని నేను అనుకుంటా. పతాకాలు సాధించడం నాకు కచ్చితంగా ముఖ్యమైన విషయం” అని సింధు చెప్పింది. గతేడాది స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్​షిప్​లో సిందు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 


logo