ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 19, 2020 , 12:40:16

ఏ మ్యాచ్ బెట‌ర్.. ఐపీఎల్ థ్రిల్ల‌ర్‌పై యువ‌రాజ్

ఏ మ్యాచ్ బెట‌ర్.. ఐపీఎల్ థ్రిల్ల‌ర్‌పై యువ‌రాజ్

హైద‌రాబాద్‌:  హోరాహోరీగా సాగుతున్న ఐపీఎల్‌లో ఆదివారం మ‌రో అద్భుతం జ‌రిగింది. కింగ్స్ లెవ‌న్ పంజాబ్‌, ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌ రెండు సూప‌ర్ ఓవ‌ర్ల వర‌కు వెళ్ల‌డం టీ20 ఉత్కంఠ‌ను తారాస్థాయికి తీసుకువెళ్లింది. ర‌సవ‌త్త‌రంగా సాగిన పోరులో కింగ్స్ లెవ‌న్ విక్ట‌రీ న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌పై మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ ఓ ట్వీట్ చేశారు.  2019లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కూడా సూప‌ర్ ఓవ‌ర్ వ‌ర‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే.  ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అనూహ్య రీతిలో విజ‌యాన్ని న‌మోదు చేసి ట్రోఫీని చేజిక్కించుకున్న‌ది. ఆ ఫైన‌ల్లో సూప‌ర్ ఓవ‌ర్ కూడా టై అయ్యింది. కానీ బౌండ‌రీల ఆధారంగా కివీస్‌పై ఇంగ్లండ్‌ను విజేత‌గా ప్ర‌క‌టించారు.  

ఆదివారం షార్జాలో పంజాబ్‌, ముంబై మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ తొలుత టై కాగా, ఆ త‌ర్వాత సూప‌ర్ ఓవ‌ర్ కూడా టై అయ్యింది. ఈ నేప‌థ్యంలో రెండ‌వ‌సారి సూప‌ర్ ఓవ‌ర్‌కు వెళ్లారు. రెండ‌వ సూప‌ర్ ఓవ‌ర్‌లో తొలుత ముంబై 11 ర‌న్స్ చేయ‌గా.. కింగ్స్ లెవ‌న్ ఆ టార్గెట్‌ను సునాయాసంగా చేధించింది.  గేల్‌, మ‌యాంక్‌లు భారీ షాట్ల‌తో థ్రిల్లింగ్ విక్ట‌రీ అందించారు.  2019 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ థ్రిల్లింగా ఉందా లేక కింగ్స్‌, పంజాబ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ ఎక్కువ థ్రిల్లింగా ఉందా అని యువ‌రాజ్ త‌న ట్వీట్‌లో ప్రేక్ష‌కుల్ని ప్ర‌శ్నించాడు. ఈ రెండు ఉత్కంఠ మ్యాచుల్లో ఏది బెట‌ర్ అని యువీ అడిగాడు.  ఐపీఎల్‌లో రెండు జ‌ట్లు అద్భుతంగా రాణించాయ‌ని, ముంబై జ‌ట్టులో బుమ్రా,  పంజాబ్ జ‌ట్టులో రాహుల్ ఇర‌గ‌దీసిన‌ట్లు యువీ కామెంట్ చేశాడు. గేల్‌, మ‌యాంక్‌లు సూప‌ర్ ఫినిష్ ఇచ్చిన‌ట్లు చెప్పాడు. ఆదివారం కోల్‌క‌తా, హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ కూడా సూప‌ర్ ఓవ‌ర్‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. 

తాజావార్తలు