బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 27, 2020 , 20:07:23

SRH vs DC: బర్త్‌డే రోజున వార్నర్‌ మెరుపులు

SRH vs DC: బర్త్‌డే రోజున వార్నర్‌ మెరుపులు

దుబాయ్:  ఐపీఎల్‌-13లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ధనాధన్‌ బ్యాటింగ్‌తో అదరగొడుతోంది.  తాను ఫామ్‌లో ఉంటే ఎంత ప్రమాదమో వార్నర్‌ మరోసారి నిరూపించాడు. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ మంగళవారం తన 34వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ ఏడాది  ఐపీఎల్‌ సీజన్‌లో పవర్‌ప్లేలో  అత్యధిక పరుగులు 52 చేసిన ఆటగాడిగా  వార్నర్‌ నిలిచాడు.  

ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడిన వార్నర్‌..25 బంతుల్లోనే 6ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముఖ్యంగా రబాడ వేసిన ఆరో ఓవర్లో వార్నర్‌ నాలుగు ఫోర్లు, సిక్సర్‌ బాది 22 పరుగులు రాబట్టాడు. మరో ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా వేగంగా ఆడుతుండటంతో పవర్‌ప్లే ఆఖరికి సన్‌రైజర్స్‌ 77 పరుగులు చేసింది.   వార్నర్‌ తన సహజమైన ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేస్తున్నాడు. 8 ఓవర్లకు హైదరాబాద్‌ వికెట్‌ నష్టపోకుండా 95 పరుగులు చేసింది. ప్రస్తుతం వార్నర్‌(58), సాహా(36) క్రీజులో ఉన్నారు.