గురువారం 02 జూలై 2020
Sports - Apr 14, 2020 , 23:30:26

వార్న‌ర్ టిక్‌టాక్ వీడియో

వార్న‌ర్ టిక్‌టాక్ వీడియో

వార్న‌ర్ టిక్‌టాక్ వీడియో

మెల్‌బోర్న్‌:క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఏర్పడిన లాక్‌డౌన్ స‌మ‌యాన్ని క్రికెట‌ర్లు చ‌క్క‌గా సద్వినియోగం చేసుకుంటున్నారు. కొంద‌రు ఫిట్‌నెస్‌పై ద్రుష్టి పెడితే..మ‌రికొందరు ఫ్యాన్స్‌కు నిరంత‌రం అందుబాటులో ఉంటున్నారు. కొవిడ్‌-19పై అభిమానుల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సోష‌ల్ మీడియాలో వీడియోలు, సందేశాలు ఉంచుతున్నారు. 

క‌రోనాపై పోరాటంలో ఇప్ప‌టికే ఓసారి గుండు చేసుకుని స‌హ‌చ‌ర క్రికెట‌ర్ల‌కు స‌వాలు విసిరిన ఆస్ట్రేలియా విధ్వంస‌క క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ మ‌రోమారు ముందుకొచ్చాడు. తన ఐదేండ్ల కూతురు ఇవీ మే కోరిక మేర‌కు టిక్‌టాక్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇనాళ్లు ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు చేసిన వార్న‌ర్ కొత్తగా టిక్‌టిక్‌లో ఓ వీడియోతో అభిమానుల‌ను అల‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. ఆసీస్ సింగ‌ర్ టోనీ వాట్స‌న్ పాట నెవ‌ర్ సీన్ ద రెయిన్‌ను ఇద్ద‌రు కూతుళ్ల‌తో క‌లిసి పాడిన వీడియోను టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. ఈ యాప్‌న‌కు కొత్తైన త‌న‌కు  ఫ్యాన్స్ స‌హాయం చేయాలంటూ వార్న‌ర్ అభ్య‌ర్థించాడు. 


logo