శనివారం 16 జనవరి 2021
Sports - Nov 29, 2020 , 10:20:35

రెండో వ‌న్డే.. వార్న‌ర్ హాఫ్ సెంచ‌రీ

రెండో వ‌న్డే.. వార్న‌ర్ హాఫ్ సెంచ‌రీ

సిడ్నీ: ఇండియాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలోనూ ఆసీస్ ఓపెన‌ర్లు చెల‌రేగుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెన‌ర్లు వార్న‌ర్‌, ఫించ్ మ‌రోసారి మంచి ఆరంభాన్నిచ్చారు. మొద‌టి నుంచీ ధాటిగా ఆడుతున్న వార్న‌ర్ ఇప్ప‌టికే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కేవ‌లం 39 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో వార్న‌ర్ హాఫ్ సెంచ‌రీ చేయ‌డం విశేషం. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భార‌త బౌల‌ర్లు ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నారు. అటు ఫించ్ కూడా నెమ్మ‌దిగా హాఫ్ సెంచ‌రీ వైపు అడుగులు వేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఆసీస్ 14 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 93 ప‌రుగులు చేసింది.