బుధవారం 20 జనవరి 2021
Sports - Dec 31, 2020 , 19:30:21

డేవిడ్‌ వార్నర్‌ 'మహర్షి' టీజర్‌ వచ్చేసింది..!

డేవిడ్‌ వార్నర్‌ 'మహర్షి' టీజర్‌ వచ్చేసింది..!

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరో విభిన్నమైన వీడియోను సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.  ఈ ఏడాది కరోనా లాక్‌డౌన్‌ నుంచి  తెలుగు సినిమా పాటలు, డైలాగులు, హీరోల హావభావాలతో వీడియో రూపొందించి అలరించాడు వార్నర్. ముఖ్యంగా టిక్‌టాక్‌ వీడియోలతో తెలుగు ప్రజలు, సన్‌రైజర్స్‌  హైదరాబాద్‌ అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. 

తాజాగా  సూపర్‌స్టార్‌  మహేశ్‌ బాబు నటించిన “మహర్షి” సినిమా టీజర్‌ను ఎడిట్‌ చేసిన వార్నర్‌.. మహర్షిలా కనిపించి ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు.  సినిమాలోని కొన్ని సీన్స్‌లో  మహేశ్‌ ముఖానికి  బ‌దులు త‌న ఫొటోని యాడ్ చేసిన వార్నర్‌ మరికొన్ని గంటల్లో 2020 ముగుస్తుందనగా సరికొత్త వీడియోను మళ్లీ ఇన్‌స్టాలో  షేర్ చేశాడు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 


logo