శుక్రవారం 07 ఆగస్టు 2020
Sports - Jul 16, 2020 , 14:59:44

కూతుళ్లతో సరదాగా గడుపుతున్న వార్నర్‌.. వీడియో వైరల్‌

కూతుళ్లతో సరదాగా గడుపుతున్న వార్నర్‌.. వీడియో వైరల్‌

న్యూఢిల్లీ : ఆస్టేలియా క్రికెట్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ లాక్‌డౌన్‌ సమయంలో టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ తన అభిమానులను అలరించాడు.  తన సతీమణితో కలిసి బుట్టబొమ్మ, రాములో రాములా వంటి పాటలకు నృత్యాలు చేశాడు. ప్రస్తుతం భారత్‌లో టిక్‌టాక్‌ను నిషేధించారు. అయినా సరే సోషల్‌మీడియాలో అభిమానులకు టచ్‌లోనే ఉంటుంన్నాడు. ఇటీవల తన కుమార్తె ఐవీతో  కలిసి క్రికెట్‌ ఆడాడు. వరుసగా రెండు క్యాచ్‌లు కూడా అందుకున్నాడు.

మరో వీడియోలో ఐవీ గోల్ఫ్‌ కొట్టిన విధానాన్ని చూసి వార్నర్‌ ఆశ్చర్యపోయాడు. ఆ స్వింగ్‌ చూసి తనకు ఆశ్చర్యమేసిందని చెప్పాడు. మొత్తని ఈ లాక్‌డౌన్‌ సమయంలో తన కూతుళ్లతో సరదాగా గడుపుతున్నాడు వార్నర్‌.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.




logo