గురువారం 09 జూలై 2020
Sports - May 11, 2020 , 15:46:24

2021 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ నెగ్గ‌డ‌మే నా ల‌క్ష్యం: మిథాలీ రాజ్‌

2021 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ నెగ్గ‌డ‌మే నా ల‌క్ష్యం:  మిథాలీ రాజ్‌

న్యూఢిల్లీ: మ‌హిళ‌ల క్రికెట్‌లో అత్యంత చెత్త క్ష‌ణాల నుంచి అత్యుత్త‌మ అనుభ‌వాల వ‌ర‌కు అన్నింటిని రుచి చూసిన వ‌న్డే జ‌ట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌.. 2021 ప్ర‌పంచెక‌ప్ నెగ్గ‌డ‌మే త‌న ల‌క్ష్యమ‌ని అంటున్న‌ది. ప్ర‌స్తుతం దేశంలో మ‌హిళ‌ల క్రికెట్‌లో పెను మార్పులు వ‌చ్చాయ‌ని.. బీసీసీఐ ప‌రిధిలోకి వ‌చ్చాక త్వ‌రిత‌గ‌తిన అభివృద్ధి సాధ్యప‌డింద‌ని మిథాలీ పేర్కొంది.

`ఒక‌ప్పుడు మ‌హిళ‌ల మైదానాలు అంటే.. అచ్చం పంట‌పొలాలే. ఎగుడుదిగుడుగా ఏమాత్రం ఆట‌కు అనుకూలంగా ఉండ‌క‌పోయేవి. శిక్ష‌ణ, వ‌స‌తుల విష‌యంలో చాలా వెనుక‌బ‌డి ఉండేది. ఎప్పుడైతే మ‌హిళ‌ల క్రికెట్ కూడా బీసీసీఐ ప‌రిధిలో చేరిందో అప్ప‌టి నుంచి ఒక్క‌సారిగా అభివృద్ధి ఊపందుకుంది. సుమారు రెండు ద‌శాబ్దాలుగా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కొన‌సాగుతున్నా. వ‌చ్చే ఏడాది (2021) జ‌రుగ‌నున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను దేశానికి అందించ‌డ‌మే నా ల‌క్ష్యం` అని మిథాలీ చెప్పింది.


logo