బుధవారం 08 జూలై 2020
Sports - Apr 20, 2020 , 18:12:26

ప‌త‌కానికి ఎంతో దూరంలో లేను: కేటీ ఇర్ఫాన్‌

ప‌త‌కానికి ఎంతో దూరంలో లేను:  కేటీ ఇర్ఫాన్‌

న్యూఢిల్లీ:  రేస్ వాకింగ్‌లో భార‌త్ త‌ర‌ఫున తొలి ఒలింపిక్ ప‌త‌కం సాధించిన అథ్లెట్‌గా నిలువ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని కేటీ ఇర్ఫాన్ తెలిపాడు. ఆసియా రేస్ వాకింగ్ చాంపియ‌న్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలువ‌డం ద్వారా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించినీ రేస్ వాక‌ర్‌.. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌తిష్ఠాత్మ‌క క్రీడ‌లు ఏడాది వాయిదా ప‌డ‌టంతో ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. 2012 లండ‌న్ ఒలింపిక్స్‌లో ప‌దో స్థానంలో నిలిచిన ఇర్ఫాన్‌.. ఆ త‌ర్వాత రియో (2016) క్రీడ‌ల‌కు అర్హ‌త సాధించినా.. స్ట్రెస్ కార‌ణంగా ఒలింపిక్స్‌లో పాల్గొన‌లేదు. ఇక ప్ర‌స్తుతం టోక్యోపైనే పూర్తి దృష్టి నిలిపిన ఇర్ఫాన్‌.. ప‌త‌కానికి తాను ఎంతో దూరంలో లేన‌ని.. క‌చ్చితంగా దాన్ని ముద్దేడే తీరుతాన‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నాడు.

`లండ‌న్ క్రీడ‌ల్లో 01:20:21 టైమింగ్‌తో రేస్ ముగించాను. కాంస్యం సాధించిన చైనా వాక‌ర్ టైమింగ్ 1:19:25. అంటే నేను ప‌త‌కానికి ఎంతో దూరంలో లేను. వాక్‌ను మ‌రో నిమిషం ముందు పూర్తి చేయ‌డంపైనే దృష్టిపెట్టా. ఈ సారి అది క‌చ్చితంగా సాధ్య‌ప‌డుతుంది. దేశం త‌ర‌ఫున రేస్ వాకింగ్‌లో తొలి ప‌త‌కం సాధించిన అథ్లెట్‌గా నిలువాల‌నుకుంటున్నా` అని ఇర్ఫాన్ వివ‌రించాడు.logo