గురువారం 09 జూలై 2020
Sports - Jun 13, 2020 , 17:04:03

అఫ్రిది కోలుకోవాలని కోరుకుంటున్నా: గౌతీ

అఫ్రిది కోలుకోవాలని కోరుకుంటున్నా: గౌతీ

న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన పడిన పాకిస్థాన్ మాజీ ఆల్​రౌండర్ షాహిద్ అఫ్రిది త్వరగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నాని టీమ్​ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చెప్పాడు. అఫ్రిదితో తనకు రాజకీయ పరమైన విబేధాలు మాత్రమే ఉన్నాయని శనివారం ఓ టీవీ షోలో గంభీర్ అన్నాడు.

“వైరస్​ ఎవరికీ సోకకూడదు. అఫ్రిదితో నాకు రాజకీయ పరమైన విబేధాలు ఉన్నాయి. కానీ అతడు ఎంత వీలైత అంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. అయితే నా దేశంలో వైరస్ బారిన పడిన ప్రతి ఒక్కరూ త్వరగా కోలుకోవాలని అంత కంటే ఎక్కువగా ఆకాంక్షిస్తున్నా. నా దేశ ప్రజల గురించే నేను ఎక్కువగా ఆలోచిస్తున్నా. భారత్​కు సాయం చేస్తామని పాకిస్థాన్ ముందుకొచ్చింది. అయితే ముందు వాళ్ల దేశ ప్రజలకే పాక్ సాయం చేసుకోవాలి. వారు సాయం చేసేందుకు ముందుకు వచ్చినందుకు సంతోషమే.. అయితే ముందు సరిహద్దుల వెంట ఉగ్రవాదాన్ని పాక్ ఆపాలి” అని గంభీర్ అన్నాడు

కాగా ఎంతో కాలంగా చాలా విషయాలపై.. ముఖ్యంగా కశ్మీర్ అంశంపై గంభీర్ – అఫ్రిది మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ఇటీవల భారత ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అఫ్రిదికి గంభీర్ గట్టిగా బదులిచ్చాడు. పాకిస్థాన్ ప్రజలను మోసం చేసేందుకు అఫ్రిది లాంటి జోకర్లు భారత్​పై విషం చిమ్ముతున్నారంటూ గౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 


logo