గురువారం 16 జూలై 2020
Sports - Jun 15, 2020 , 21:36:54

మళ్లీ టెస్ట్‌లు ఆడేందుకు వాహబ్‌ ఆసక్తి

మళ్లీ టెస్ట్‌లు ఆడేందుకు వాహబ్‌ ఆసక్తి

లాహోర్‌(పాకిస్తాన్‌): ఇంగ్లాండ్‌ టూర్‌ నేపథ్యంలో తనకు అవకాశమిస్తే మళ్లీ టెస్ట్‌లు ఆడేందుకు సిద్ధమని పాకిస్తాన్‌ పేస్‌బౌలర్‌ వాహబ్‌ రియాజ్‌ వెల్లడించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడేందుకు వాహబ్‌ 2019 నుంచి టెస్ట్‌లకు విరామం ప్రకటించాడు. జూలై 30 నుంచి ఇంగ్లాండ్‌లో జరుగనున్న మూడు టెస్టులు, టీ20 మ్యాచ్‌లకు ఎంపిక చేసిన 29 మంది క్రీడాకారుల బృందంలో వాహబ్‌ ఉన్నాడు.  

  ‘నేను ఈ టూర్‌లో ఉండడం సంతోషంగా ఉంది. అసాధారణ పరిస్థితుల్లో దీన్ని నిర్వహిస్తున్నారు. టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడమని నన్ను పీసీబీ (పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు) ఆహ్వానిస్తే తప్పకుండా ఒప్పుకుంటా. జట్టు తరఫున ఆడడం గౌరవంగా భావిస్తా’ అని వాహబ్‌ ఒక వీడియో కాన్ఫరెన్స్‌లోవ్యాఖ్యానించాడు. 34 ఏళ్ల ఈ పేసర్‌ 2008 నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. హై పేస్‌, రివర్స్‌ స్వింగ్‌ అవసరమున్నప్పుడు మాత్రమే అతడిని జట్టులోకి తీసుకుంటున్నారు. అప్పటినుంచి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వాహబ్‌ జట్టులో ఉంటున్నాడు. logo