మంగళవారం 02 మార్చి 2021
Sports - Feb 06, 2021 , 00:36:07

సీఎం జన్మదినం సందర్భంగా వాలీబాల్‌ టోర్నమెంట్‌

సీఎం జన్మదినం సందర్భంగా వాలీబాల్‌ టోర్నమెంట్‌

ఆర్కేపురం, ఫిబ్రవరి 5: సీఎం కేసీఆర్‌ జన్మదినం (ఈ నెల 17) సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌ పోస్టర్లను ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఆమె కార్యాలయంలో ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఈ నెల 8,9 తేదీల్లో జిల్లాస్థాయి పోటీలు జరుగుతాయని జాగృతి జిల్లా అధ్యక్షురాలు సేనాపతి అర్చన తెలిపారు. అలాగే జిల్లాల్లో నిర్వహించే పోటీల్లో విజేతగా నిలిచే జట్లు ఈ నెల 13 నుంచి 16 వరకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని పేర్కొన్నారు. ఈ టోర్నీలో విజేతలకు రూ.లక్ష, రన్నరప్‌కు రూ.75 వేలు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనాచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్‌సాగర్‌, వరలక్ష్మి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు నవీన్‌గౌడ్‌, యువత అధ్యక్షుడు సందీప్‌, జిల్లా కోశాధికారి డి.కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo